తెలంగాణలో మరో 364 కరోనా పాజిటివ్ కేసులు
Add ap7am to your home Screen

తెలంగాణలో మరో 364 కరోనా పాజిటివ్ కేసులు

Telangana corona cases and deaths details
  • గత 24 గంటల్లో 75,289 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 76 కేసులు
  • పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 6,608 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 75,289 కరోనా పరీక్షలు నిర్వహించగా, 364 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 76 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 44 కేసులు గుర్తించారు. అనేక జిల్లాల్లో రెండంకెల లోపే కొత్త కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 482 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,54,758 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,44,294 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,608 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,856కి పెరిగింది.
Telangana
Corona Virus
Positive Cases
Deaths

More Telugu News