తాలిబన్ల చేతుల్లోకి ఆఫ్ఘనిస్థాన్.. భారత్ అధ్యక్షతన ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసర భేటీ
- ఈ సాయంత్రం 7.30 గంటలకు భద్రతామండలి సమావేశం
- సమావేశానికి అధ్యక్షత వహించనున్న భారత్
- తాలిబన్లకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని ఐరాస నిర్ణయం
యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కు ప్రస్తుతం భారత్ అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 1వ తేదీన ఈ బాధ్యతలను చేపట్టిన భారత్... నెల రోజుల పాటు ఈ బాధ్యతను నిర్వహించనుంది. అయితే, భారత్ బాధ్యతలను చేపట్టిన వెంటనే ఆప్ఘనిస్థాన్ లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఆగస్ట్ 6 నుంచి తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకోవడం ప్రారంభించారు.