Pavan kalyan: యాక్షన్ ఎపిసోడ్లో పవన్ కల్యాణ్!

  • షూటింగు దశలో పవన్ రీమేక్
  • మరో ప్రధాన పాత్రలో రానా  
  • పవన్ బర్త్ డే స్పెషల్ గా ఫస్టు సింగిల్
  • 'సంక్రాంతి'కి విడుదల
Pavan kalyan in action episode

పవన్ కల్యాణ్ - రానా ప్రధాన పాత్రధారులుగా 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ రూపొందుతోంది. మలయాళంలో వైవిధ్యభరితమైన కథా చిత్రంగా ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను, కొద్దిపాటి మార్పులతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇటీవల పవన్ - రానా కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరువాత పవన్ - నిత్యమీనన్ లపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం పవన్ పై హైదరాబాద్ .. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

పోలీస్ ఆఫీసర్ గా పవన్ నటిస్తున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పవన్ పుట్టినరోజు కానుకగా వచ్చేనెల 2వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. రానా సరసన ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్న ఈ సినిమాను 'సంక్రాంతి' పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News