Andhra Pradesh: ఏపీలో కొత్తగా 2,050 మందికి కొవిడ్ పాజిటివ్

AP Corona cases daily bulletin
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 85,283 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,050 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 375 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 324, నెల్లూరు జిల్లాలో 221, ప్రకాశం జిల్లాలో 212, గుంటూరు జిల్లాలో 209 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 23 కొత్త కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 2,458 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మంది మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 13,531 మంది కరోనాతో కన్నుమూశారు. ఏపీలో ఇప్పటిదాకా 19,82,308 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,48,828 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 19,949 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Daily Cases
Deaths
COVID19

More Telugu News