Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • వంటల కబుర్లు చెప్పనున్న తమన్నా 
  • 'సలార్' కోసం ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్
  • 'శాకుంతలం'లో బాలీవుడ్ నటుడు  
Thamanna to host Master Chef reality show

*  సినిమాలు, వెబ్ సీరీస్ లతో బిజీగా వున్న కథానాయిక తమన్నా ఇప్పుడు ఓ రియాలిటీ షోతో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుంది. వరల్డ్స్ బిగ్గెస్ట్ కుకింగ్ రియాలిటీ షో అయిన 'మాస్టర్ చెఫ్' ద్వారా వివిధ రకాల తెలుగు వంటలను, తెలుగు సంస్కృతిని పరిచయం చేసే కార్యక్రమానికి ఈ ముద్దుగుమ్మ హోస్ట్ గా చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని త్వరలో జెమినీ టీవీలో ప్రసారం చేస్తారు.
*  ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సలార్' చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. కథానాయిక శ్రుతిహాసన్ కూడా తాజాగా షూటింగులో జాయిన్ అయింది. ఈ షెడ్యూలులో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  సమంత కథానాయికగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న 'శాకుంతలం' చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. ఇందులో ఓ కీలక పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ పోషించనున్నట్టు చిత్ర నిర్మాత నీలిమ ప్రకటించారు. ఈ చిత్రంలో దుష్యంతుడుగా దేవ్ మోహన్, శకుంతలగా సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News