నా పుట్టినరోజు నాడు ప్రతి అభిమాని 3 మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను: మహేశ్ బాబు
- ఈ నెల 9న మహేశ్ బాబు పుట్టినరోజు
- వేడుకలు చేయొద్దని అభిమానులకు విజ్ఞప్తి
- గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొనాలని సూచన
- ఫొటోలకు తనను ట్యాగ్ చేయాలని వెల్లడి
ఈసారి ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన 'గ్రీన్ ఇండియా చాలెంజ్' లో పాల్గొని మొక్కలు నాటాలని పేర్కొన్నారు. మొక్కలు నాటిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి తనను ట్యాగ్ చేయాలని, తద్వారా ఆ ఫొటోలను తాను కూడా చూస్తానని మహేశ్ బాబు పేర్కొన్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు పరశురాం దర్శకుడు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ గోవాలో జరగనుంది. ఈ నేపథ్యంలో తన కుటుంబ సభ్యులతో కలిసి మహేశ్ బాబు గోవాలో సెట్స్ పై తన పుట్టినరోజు జరుపుకుంటాడని తెలుస్తోంది.