వచ్చేనెలలో సెట్స్ పైకి శంకర్ తో చరణ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వచ్చేనెలలో సెట్స్ పైకి శంకర్ తో చరణ్!

Shankar movie shooting starts from next month
  • శంకర్ సినిమాకి సన్నాహాలు
  • రెడీ అవుతున్న రామ్ చరణ్
  • జూన్ నాటికి షూటింగు పూర్తి
  • వచ్చే దసరాకి రిలీజ్ చేసే ఛాన్స్
హీరోగా శంకర్ దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేయనున్నాడనే టాక్ వచ్చిన దగ్గర నుంచి అందరిలో ఆసక్తి మొదలైంది. ఎందుకంటే శంకర్ సినిమా అనగానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దక్షిణాది వారి దృష్టి ఆ సినిమా పైనే ఉంటుంది. శంకర్ కథలో భారీతనం ఉంటుంది .. భారీ తారాగణం ఉంటుంది. కథను .. సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిపి నడిపించడం ఆయనకు బాగా తెలుసు.

మొదటి నుంచి కూడా ఆయన తన సినిమాలను తమిళంలో రూపొందించి, ఇతర భాషల్లో విడుదలయ్యేలా చూసుకునేవారు. ఒక పాటను ప్రపంచంలోని ఏడు అద్భుతాల దగ్గర చిత్రీకరించిన దర్శకుడు ఆయన. ఖర్చు విషయంలో ఆయనను నియంత్రించడం చాలా కష్టమైన విషయం. అలాంటి దర్శకుడితో ఈ సినిమాను 'దిల్' రాజు నిర్మిస్తుండటం విశేషం.

దర్శకుడిగా శంకర్ తన వైపు నుంచి అన్ని పనులు చకచకా పూర్తి చేస్తున్నాడట. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగును జూన్ నాటికి పూర్తి చేసేలా శంకర్ - దిల్ రాజు మాట్లాడుకున్నారట. అంటే చరణ్ నుంచి ఈ దసరాకి 'ఆర్ ఆర్ ఆర్' వస్తే, వచ్చే దసరాకి శంకర్ సినిమా వస్తుందన్న మాట.
Charan
Shankar
Dil Raju

More Telugu News