Telangana: తెలంగాణలో కొత్తగా 657 మందికి కరోనా

Media Bulletin on status of positive cases in Telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో గత 24 గంటల్లో 1,16,815 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 657 మందికి కరోనా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 77 కేసులు నమోదయ్యాయి. ఇక నారాయణ్ పేట జిల్లాలో కొత్త కేసులేమీ నమోదు కాలేదు. ఇదే సమయంలో ఇద్దరు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోగా... 578 మంది కోలుకున్నారు.

తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,43,093కి చేరింది. ఇప్పటి వరకు 6,29,986 మంది కరోనా నుంచి కోలుకోగా... 3,793 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,314 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో రికవరీ రేటు 97.37 శాతంగా ఉండగా... తెలంగాణలో 97.96 శాతంగా ఉంది.  
Go Back to Shorts
Telangana
Corona Virus
Updates

More Telugu News