Nani: 'అంటే .. సుందరానికీ' గ్యాప్ లేనట్టే!

  • విడుదలకు సిద్ధంగా 'టక్ జగదీష్'
  • షూటింగు పూర్తి చేసిన 'శ్యామ్ సింగ రాయ్'
  • సెట్స్ పైకి వెళుతున్న 'అంటే .. సుందరానికీ'
  • కథానాయికగా నజ్రియా పరిచయం
Ante Sundaraniki movie shooting continues

నాని హీరోగా చేసిన 'టక్ జగదీష్' షూటింగును పూర్తిచేసుకుని చాలా రోజులే అవుతుంది. కరోనా కారణంగా విడుదలను వాయిదా వేసుకున్న ఈ సినిమా, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనుంది. ఆ తరువాత సినిమాగా ఆయన చేస్తున్న 'శ్యామ్ సింగ రాయ్' నిన్ననే షూటింగు పార్టును పూర్తిచేసుకుంది.

నాని కెరియర్లోనే విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందింది. లుక్ పరంగా కూడా నాని కొత్తగా కనిపించనున్నాడు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా షూటింగు పూర్తయిన తరువాత నాని పెద్దగా గ్యాప్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. తదుపరి ప్రాజెక్టు 'అంటే సుందరానికీ'పై ఆయన పూర్తి దృష్టి పెట్టనున్నట్టు చెబుతున్నారు.

వివేక్ ఆత్రేయ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రేక్షకులను ఆద్యంతం నవ్వించడానికి వివేక్ ఆత్రేయ ఈ సారి ఒక కొత్తకథను ఎంచుకున్నాడు. టైటిల్ తోనే ఈ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాతో తెలుగు తెరకి నజ్రియా నజీమ్ కథానాయికగా పరిచయమవుతోంది. ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.    

More Telugu News