సీఎం జ‌గ‌న్‌కు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు మరో లేఖ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎం జ‌గ‌న్‌కు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు మరో లేఖ

raghu rama writes letter to jagan
  • విశాఖ భూముల కుంభకోణం ప్ర‌స్తావ‌న‌
  • ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ జరిపించాలి
  • కుంభకోణంలో పాలుపంచుకున్న వారందరి పైనా చర్యలు తీసుకోవాలి
  • అన్ని విషయాలను ప్రజలకు తెలియజేయాలి
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు వైసీపీ అసంతృప్త ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు మరో లేఖ రాశారు. విశాఖ భూముల కుంభకోణం అంశాన్ని ఆయ‌న ఈ లేఖ‌లో ప్ర‌స్తావించారు. విశాఖ భూముల కుంభకోణంపై గతంలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ జరిపించి, ఈ భూ కుంభకోణంలో పాలుపంచుకున్న వారందరి పైనా తగిన చర్యలు తీసుకోవాలని, విశాఖ నగరంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి జ‌గ‌న్ ను కోరుతున్నాన‌ని చెప్పారు.

అక్ర‌మాల‌కు పాల్ప‌డిన రాజ‌కీయ నాయ‌కులు, అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అన్నారు. విశాఖ భూ కుంభకోణంలో జరుగుతున్న పరిణామాలపై ఎలాంటి ప‌క్ష‌పాతం లేకుండా దర్యాప్తు జ‌రిపించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు.

  
Raghu Rama Krishna Raju
Jagan
YSRCP

More Telugu News