తెలంగాణలో థియేటర్లు మళ్లీ తెరుచుకుంటున్నాయి... ప్రభుత్వం అనుమతి
- కరోనా వ్యాప్తితో మూతపడ్డ సినిమా హాళ్లు
- మంత్రి తలసానిని కలిసిన ఫిలిం చాంబర్ ప్రతినిధులు
- సినిమాటోగ్రఫీ మంత్రికి వినతిపత్రం సమర్పణ
- సానుకూలంగా స్పందించిన తలసాని
- రేపట్నించి థియేటర్ల రీఓపెనింగ్
ఇవాళ తెలంగాణ ఫిలించాంబర్ ప్రతినిధులు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసానిని కలిసి థియేటర్ల ఓపెనింగ్ పై వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. ఫిలిం చాంబర్ ప్రతినిధుల విజ్ఞప్తుల పట్ల తలసాని సానుకూలంగా స్పందించారు.