సెట్స్ కి వెళుతున్న రామ్-కృతి జంట!

Ram new movie schedule to be started soon
  • 'రెడ్' తర్వాత రామ్ నటిస్తున్న చిత్రం 
  • తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం
  • 'ఉప్పెన' భామ కృతి శెట్టితో రామ్ జోడీ 
  • జులై 12 నుంచి షూటింగ్ మొదలు 
ఎనర్జిటిక్ హీరో రామ్ ఇక మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఆమధ్య విడుదలైన 'రెడ్' సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని ఇప్పుడు తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో చేస్తున్నాడు. సరికొత్త కథలతో స్టయిలిష్ యాక్షన్ చిత్రాలను రూపొందించడంలో లింగుస్వామికి పేరుంది. ఇక ఇప్పుడు తనకు ఎనర్జిటిక్ హీరో రామ్ దొరకడంతో ఆయన వినూత్న కథను తయారుచేసుకున్నాడు.
 
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఉప్పెన' సినిమాతో ఒక్కసారిగా దూసుకొచ్చి, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాలబొమ్మ కృతి శెట్టి ఇందులో కథానాయికగా నటించనుంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంతకుముందే మొదలవ్వాల్సింది. అయితే, కరోనా ఉద్ధృతి కారణంగా వాయిదాపడుతూ వచ్చింది.

ఇక ఇప్పుడు కరోనా వ్యాప్తి తగ్గడం.. ఒక్కొక్కరే షూటింగులు మొదలుపెడుతుండడంతో ఈ చిత్రం కూడా సెట్స్ కు వెళ్లడానికి రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఈ చిత్రం షూటింగును ఈ నెల 12 నుంచి హైదరాబాదులో నిర్వహించనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ఈరోజు తాజాగా అప్ డేట్ ఇచ్చింది. ఇది రామ్ నటిస్తున్న 19వ చిత్రం!
Go Back to Shorts
Ram Potineni
Kriti Shetty
Lingu Swamy

More Telugu News