Trivikram Srinivas: మహేశ్ బాబు కోసం స్పీడ్ పెంచిన త్రివిక్రమ్!

  • మహేశ్ తో త్రివిక్రమ్ మూవీ
  • సంగీత దర్శకుడిగా తమన్
  • ఇద్దరు కథానాయికలకు చోటు
  • దసరాకి షూటింగ్ మొదలు
Mahesh Babu movie works are going fast

త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా మొదలుకానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు జోరందుకున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను రెడీ చేశారు. సంగీత దర్శకుడిగా తమన్ ను తీసుకున్నారు. ఒకటి రెండు రోజులలో మ్యూజిక్ సిటింగ్స్ మొదలుపెడతారట. అలాగే ఈ సినిమాలో మిగతా నటీనటుల ఎంపిక .. సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియను ఆరంభించనున్నారని అంటున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు స్పీడ్ అందుకున్నాయని చెబుతున్నారు.

కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉంటారట. వాళ్ల ఎంపికను త్వరలోనే పూర్తి చేయనున్నట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ నాటికి అన్ని పనులను పూర్తిచేసుకుని, దసరా సందర్భంగా షూటింగును మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. గతంలో మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'అతడు'.. 'ఖలేజా' అభిమానులకు అలా గుర్తుండిపోయాయి. అందువలన మూడోసారి ఈ కాంబినేషన్లో రానున్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలను త్రివిక్రమ్ ఎంతవరకూ అందుకుంటారో చూడాలి మరి.

More Telugu News