అద్భుతం చేశారు దీపికా కుమారీ... భారత ఆర్చరీ తారకు మహేశ్ బాబు అభినందనలు
- పారిస్ లో వరల్డ్ కప్ ఆర్చరీ
- రికర్వ్ విభాగంలో సత్తా చాటిన దీపిక
- టీమ్, మిక్స్ డ్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణాలు
- మరింతగా దూసుకెళ్లాలన్న మహేశ్ బాబు
దీపికా కుమారి రికర్వ్ ఉమెన్స్ టీమ్ విభాగంలో, రికర్వ్ మిక్స్ డ్ టీమ్ విభాగంలో, మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకాలు సాధించి భారత కీర్తిపతాకను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించింది. ఒలింపిక్స్ కు ముందు భారత ఆర్చరీ రంగంలో కొత్త ఆశలు కలిగించింది. వరల్డ్ కప్ ఆర్చరీలో మూడు స్వర్ణ పతకాలు గెలుచుకోవడం ద్వారా దీపికా కుమారి ప్రపంచ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది.