కొత్త లగ్జరీ విమానానికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన సీఎం రమేశ్
- వీడియో వైరల్
- కడప ఎయిర్ పోర్టులో లగ్జరీ ప్లేన్
- కొబ్బరికాయ కొట్టిన సీఎం రమేశ్
- ఆపై విమానంలో ప్రవేశం
- అది సీఎం రమేశ్ ప్లేన్ అంటూ ప్రచారం
దీనిపై సీఎం రమేశ్ ప్రతినిధులు స్పందించారు. ఆ విమానం సీఎం రమేశ్ కు చెందినది అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేశారు. ఆ విమానాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి దానికి పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో సీఎం రమేశ్ ను కూడా ఆహ్వానించారని వెల్లడించారు. విమాన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లిన సీఎం రమేశ్ సంప్రదాయాలను అనుసరించి కొబ్బరికాయ కొట్టారే తప్ప, విమానం ఆయనది కాదని ఓ ప్రకటనలో వివరించారు.