కేంద్రం చేతిలో మైనర్ పోర్టుల నిర్వహణ అంటే రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయడమే: మంత్రి మేకపాటి
- పోర్టుల ముసాయిదా బిల్లుపై మేకపాటి స్పందన
- బిల్లుపై అభ్యంతరం
- అధ్యయనానికి సమయం కావాలని వెల్లడి
- నిపుణుల కమిటీ వేస్తామని వివరణ
ఈ బిల్లుపై తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని వెల్లడించారు. బిల్లుపై అధ్యయనానికి కొంత సమయం అవసరమని కేంద్రానికి తెలిపినట్టు వివరించారు. ఓ నిపుణుల కమిటీ వేసి అధ్యయనం జరుపుతామని పేర్కొన్నారు.
ఏపీ పోర్టుల గురించి చెబుతూ, రామాయపట్నం పోర్టు పనులు ఈ నవంబరులో ప్రారంభం అవుతాయని వెల్లడించారు. వచ్చే 5 సంవత్సరాల్లో 6 పోర్టులను అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి సారించామని మంత్రి మేకపాటి చెప్పారు. మారిటైమ్ బోర్డుకు దీర్ఘకాలిక ప్రాతిపదికన నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు.