కారులో సీఎం ఉండగానే... ఎస్పీ, సెక్యూరిటీ అధికారుల కొట్లాట!
- హిమాచల్ ప్రదేశ్ లో ఘటన
- రాష్ట్రానికి నితిన్ గడ్కరీ రాక
- స్వాగతం పలికేందుకు బయల్దేరిన సీఎం
- సెక్యూరిటీ అధికారి చెంప చెళ్లుమనిపించిన ఎస్పీ
- ఎస్పీని కాలితో తన్నిన మరో సెక్యూరిటీ అధికారి
ఇంతలో మరో సెక్యూరిటీ అధికారి వచ్చి ఆ ఎస్పీని కాలితో తన్నాడు. దాంతో ఆ ఎస్పీ సెక్యూరిటీ అధికారి దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అంతలో సిబ్బంది వారిద్దరినీ శాంతపరచడంతో ఉద్రిక్త వాతావరణం సద్దుమణిగింది. కాగా, ఈ గొడవ జరుగుతున్న సమయంలో సీఎం జైరాం ఠాకూర్ కారులో ఉన్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన హిమాచల్ ప్రదేశ్ డీజీపీ విచారణకు ఆదేశించారు. ఈ కొట్లాటకు సంబంధించిన దృశ్యాలున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.