Corona Virus: దేశంలో నిన్న 50,848 క‌రోనా కేసుల న‌మోదు

Media Bulletin on status of positive cases COVID19 in india
షార్ట్స్‌లో చూడండి
దేశంలో నిన్న 50,848 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం... నిన్న 68,817 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,28,709కు చేరింది.

ఇక మరణాల విషయానికొస్తే, నిన్న 1,358 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,90,660 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,89,94,855 మంది కోలుకున్నారు. 6,43,194 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
     
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 39,59,73,198 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,01,056 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News