Velagapudi Rama Krishna Babu: జైల్లో ఉన్న చరిత్ర నీది... పుట్టుకతోనే రాజవంశీకుడు ఆయన: వెలగపూడి ఫైర్
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించడంపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయసాయికి కౌంటర్ ఇచ్చారు.
'16 నెలలు జైల్లో ఉండొచ్చిన నీవెక్కడ? పుట్టుకతోనే రాజవంశీకుడైన అశోక్ గజపతిరాజు ఎక్కడ?' అంటూ వెలగపూడి ఎద్దేవా చేశారు. మాన్సాస్ లో అక్రమాలు జరిగాయని విజయసాయి అంటున్నాడని... నువ్వు నియమించిన తొత్తే కదా ఏడాదిగా మాన్సాస్ ఛైర్ పర్సన్ గా ఉన్నది అని మండిపడ్డారు. 'సంచయిత ఛైర్ పర్సన్ గా ఉన్నప్పుడు అక్రమాలు నీకు కనపడలేదా? ఏడాది కాలంగా గుడ్డు మీద ఈకలు పీకుతున్నావా?' అంటూ వెలగపూడి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.