Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • 'శాకుంతలం' షూటింగుకి ఏర్పాట్లు 
  • మరో తెలుగు సినిమాలో తాప్సి
  • చైతు హిందీ సినిమా అప్ డేట్స్
Samantha to join Shakuntalam sets by the end of this Month

*  ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో సమంత కథానాయికగా రూపొందుతున్న 'శాకుంతలం' చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగును ఈ నెల చివరి వారంలో ప్రారంభించనున్నారు. ఆ షూటింగులో హీరోయిన్ సమంత కూడా పాల్గొంటుంది.
*  ఆమధ్య 'గేమ్ ఓవర్' సినిమాలో నటించిన కథానాయిక తాప్సి తాజాగా మరో తెలుగు సినిమాలో నటించనుంది. స్వరూప్ దర్శకత్వం వహించే 'మిషన్ ఇంపాజిబుల్' చిత్రంలో తాప్సి ప్రధాన పాత్రలో నటించనున్నట్టు సమాచారం.
*  అక్కినేని నాగ చైతన్య తొలిసారిగా ఓ హిందీ సినిమాలో నటిస్తున్న సంగతి విదితమే. ఆమిర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న 'లాల్ సింగ్ చద్దా' చిత్రంలో చైతన్య కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ నిన్నటి నుంచి ముంబైలో జరుగుతోంది. దీని తర్వాత లడఖ్ లో జరిగే షూటింగులో చైతు పాల్గొంటాడట.

More Telugu News