Han Junwei: బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చైనా జాతీయుడిని అదుపులోకి తీసుకున్న భారత భద్రతా బలగాలు

  • అనుమానాస్పదంగా చైనా వ్యక్తి
  • పశ్చిమ బెంగాల్ లోని మాల్డా జిల్లాలో పట్టుబడిన వైనం
  • కాలియాచక్ పోస్టు వద్దకు తీసుకువచ్చిన జవాన్లు
  • చైనీయుడ్ని ప్రశ్నిస్తున్న భద్రతా సంస్థలు
BSF detained a Chinese man at Indo Bangla border

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఓ చైనీయుడు భద్రతా బలగాలకు పట్టుబడ్డాడు. అనుమానాస్పద చర్యల కారణంగా అతడిని పశ్చిమ బెంగాల్ లోని మాల్డా జిల్లాలో నిర్బంధంలోకి తీసుకున్నట్టు బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) అధికారులు తెలిపారు. ఆ చైనా జాతీయుడి పేరును హాన్ జున్ వీయ్ అని గుర్తించారు. అతడి నుంచి చైనా పాస్ పోర్టు, బంగ్లాదేశ్ వీసా, ఒక ల్యాప్ టాప్, మూడు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

సరిహద్దు ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో ఉదయం 7 గంటలకు అదుపులోకి తీసుకున్నట్టు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. అతడిని కాలియాచక్ పోస్టు వద్దకు తీసుకువచ్చి, ఇతర భద్రతా సంస్థలకు సమాచారం అందించామని వెల్లడించారు. ప్రస్తుతం ఆ చైనా జాతీయుడిని ఇతర భద్రతా సంస్థల అధికారులు ప్రశ్నిస్తున్నారని చెప్పారు.

More Telugu News