bharati raja: 'ది ప్యామిలీ మెన్‌-2'పై ముదురుతున్న వివాదం.. భార‌తీరాజా హెచ్చరిక

  • శ్రీ‌లంక త‌మిళ యువ‌తిగా న‌టించిన సామ్‌
  • నెగెటివ్ పాత్ర‌లో క‌న‌ప‌డిన వైనం
  • నిషేధం విధించాల‌న్న భార‌తీరాజా
  • లేదంటే అమెజాన్‌పై పోరాటం చేస్తామ‌ని హెచ్చ‌రిక
bharati raja slams the familiman web series

హీరోయిన్ స‌మంత న‌టించిన 'ది ప్యామిలీ మెన్‌-2' వెబ్‌ సిరీస్‌పై వివాదాలు రాజుకుంటున్నాయి. త‌మిళ‌నాడులో ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. శ్రీలంకకు చెందిన తమిళ యువతిగా ఈ వెబ్ సిరీస్ లో సమంత న‌టించింది. ఇందులో ఆమె యాక్షన్ దృశ్యాలలో కూడా కనిపిస్తుంది.  

అయితే, ఆమె త‌మిళ యువ‌తిగా నెగెటివ్ రోల్‌లో న‌టించ‌డం ప‌ట్ల త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు మండిప‌డున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర స‌ర్కారుతో పలు రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. అయిన‌ప్ప‌టికీ ఈ వెబ్‌ సిరీస్‌ ఈ నెల 4 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో న‌డుస్తోంది. ఈ విష‌యంపై తాజాగా సీనియర్‌ దర్శకుడు భారతీరాజా కూడా మండిప‌డ్డారు.

తమిళ జాతికి వ్యతిరేకంగా 'ది ఫ్యామిలీ మెన్‌ 2' వెబ్‌ సిరీస్ రూపొందింద‌ని, దాన్ని ప్రసారం చేయకూడద‌ని విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప‌ట్టించుకోకపోవ‌డం బాధాకరమని ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ వెబ్‌ సిరీస్‌ను తమిళ ద్రోహులు రూపొందించార‌ని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి నిషేధం విధించాలని ఆయ‌న డిమాండ్ చేశారు. లేదంటే తాము అమెజాన్‌ సంస్థపై పోరాటం చేయడానికి కూడా వెనుకాడబోమని స్ప‌ష్టం చేశారు.

More Telugu News