పోలవరం ప్రాజెక్టులో అక్ర‌మాలు జ‌రుగుతున్నాయంటూ కేంద్ర మంత్రికి ర‌ఘురామకృష్ణ‌రాజు ఫిర్యాదు

raghu rama writes letter gajendra
  • కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ తో సమావేశం  
  • పోల‌వ‌రం నిర్వాసితుల పేరుతో అవ‌క‌త‌వ‌క‌లు
  • న‌కిలీ ఖాతాల‌తో నిర్వాసితుల సొమ్మును కాజేస్తున్నార‌ని ఆరోప‌ణ‌
  • సీఐడీ పోలీసులు తనపై వ్యవహరించిన తీరుపై కూడా ఫిర్యాదు
పోలవరం ప్రాజెక్టులో అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు వైసీపీ అసంతృప్త‌ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఢిల్లీలో గ‌జేంద్ర సింగ్‌తో స‌మావేశ‌మైన ర‌ఘురామ ఆయ‌న‌కు రెండు లేఖ‌లు అందించి, ప‌లు వివ‌రాలు తెలిపారు.

పోల‌వ‌రం నిర్వాసితుల పేరుతో అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. న‌కిలీ ఖాతాల‌తో నిర్వాసితుల సొమ్మును కాజేస్తున్నార‌ని తెలిపారు. ల‌బ్ధిదారుల‌ను ప‌క్క‌న‌పెడుతూ న‌కిలీల‌కే ప్రాధాన్యం ఇస్తున్నార‌ని ఆరోపించారు. దీనిపై వెంట‌నే స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. అలాగే, రివ‌ర్స‌ర్ టెండ‌రింగ్ పేరుతో అద‌న‌పు నిధులు కేటాయిస్తున్నార‌ని అన్నారు.

ఈ కేటాయింపుల్లో 25 శాతం వ‌ర‌కు కమీషన్లు కోరుతున్నారని రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. నకిలీ లబ్దిదారుల పేర్లతో ఖాతాలు తెరిచి పునరావాస నిధులు కాజేస్తున్నారని ఫిర్యాదు చేశారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అలాగే, ఏపీ సీఐడీ పోలీసులు తనపై వ్యవహరించిన తీరును కూడా గజేంద్ర సింగ్ షెకావత్‌కు ర‌ఘురామ వివరించినట్టు తెలిసింది.
Go Back to Shorts
Raghu Rama Krishna Raju
YSRCP
Polavaram Project

More Telugu News