ఆగస్టు నుంచి పట్టాలపైకి హరీశ్ శంకర్ సినిమా!
- గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' హిట్
- మరోసారి అదే కాంబినేషన్
- నెలకి 10 రోజులు కేటాయించిన పవన్
- తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం?
ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా పవన్ రెండు పాత్రల్లో కనిపించనున్నారని అంటున్నారు. తండ్రి పాత్రలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగు కోసం పవన్ నెలకి 10 రోజులు కేటాయించారని అంటున్నారు. అంటే ఒక వైపున 'హరహర మహాదేవ' .. మరో వైపున 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ లో చేస్తూనే, ఈ సినిమా షూటింగులోను పవన్ పాల్గొననున్నారన్న మాట. ఇక ఈ సినిమాలో కథానాయికలుగా అవకాశం ఎవరిని వరిస్తుందో చూడాలి.