Telangana: తెలంగాణలో కొత్తగా 2,175 మందికి కరోనా పాజిటివ్

Corona new cases declines in Telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,36,096 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,175 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 253 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 5, ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో 8, కామారెడ్డి జిల్లాలో 9 కేసులను గుర్తించారు. అదే సమయంలో 3,821 మంది కరోనా నుంచి కోలుకోగా, 15 మంది మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 5,87,664 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,53,400 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 30,918 మందికి చికిత్స జరుగుతోంది. మరణాల సంఖ్య 3,346కి చేరింది. కాగా, రాష్ట్రంలో కరోనా కేసుల రికవరీ రేటు 94.16 శాతానికి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
New Cases
Daily Cases
Deaths
Recovery Rate

More Telugu News