దీపావళికి రంగంలోకి దిగనున్న అజిత్ 'వాలిమై'
- భారీ యాక్షన్ థ్రిల్లర్ గా 'వాలిమై'
- కథానాయికగా హుమా ఖురేషి
- ప్రతినాయకుడిగా కార్తికేయ
- తెలుగు ప్రేక్షకుల్లోను పెరుగుతున్న ఆసక్తి
తమిళనాట అజిత్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఆయన సినిమాల్లోని యాక్షన్ ఎపిసోడ్స్ ను వాళ్లంతా ఎంతగానో ఇష్టపడతారు. 'వాలిమై' యాక్షన్ థ్రిల్లర్ కావడం వాళ్లలో మరింత ఆసక్తిని పెంచుతోంది. కొంతకాలంగా అజిత్ భారీ విజయాలను సొంతం చేసుకుంటూ వస్తున్నాడు. ఈ సినిమా కూడా ఆయన కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. ఇక హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్ నటిస్తుండటంతో, తెలుగు ప్రేక్షకుల్లోను ఈ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తోంది.