Etela Rajender: వావి వ‌ర‌స‌లు మ‌రిచి అధికారులు నివేదిక‌లు ఇవ్వడం ఏంటీ?: ఈట‌ల భార్య జ‌మున‌

etela wife jamuna slams trs
షార్ట్స్‌లో చూడండి
వావి వ‌ర‌స‌లు మ‌రిచి అధికారులు నివేదిక‌లు ఇవ్వడం ఏంటీ? అని తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ భార్య జ‌మున ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈట‌ల భూముల‌పై విచార‌ణ జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. అధికారులు ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి ప్రాథ‌మిక నివేదిక‌లు ఇచ్చారు.

దీనిపై హైదరాబాద్‌లో జ‌మున మీడియాతో మాట్లాడుతూ... తమ హేచరీస్‌, గోదాములపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. అయిన‌ప్ప‌టికీ వాటిని ఎలా తిప్పికొట్టాలో తమకు తెలుస‌ని చెప్పారు. మెదక్‌ జిల్లా మాసాయిపేటలో తాము 46 ఎకరాల భూమి కొనుగోలు చేశామ‌ని తెలిపారు. ఒక్క ఎకరం ఎక్కువగా ఉన్నా ముక్కు నేలకు రాస్తాన‌ని అన్నారు.

సర్వే చేసిన అధికారులు కూడా తాము నివేదిక స‌రైన రీతిలో స‌మ‌ర్పించ‌లేద‌ని తేలితే ముక్కు నేలకు రాస్తారా? అని ఆమె ప్ర‌శ్నించారు. త‌మ స్థలంలో ఏర్పాటు చేసిన పత్రికలోనే దుష్ప్రచారం చేయడం బాధాకరమ‌ని ఆమె చెప్పారు. తాము 1992లో దేవరయాంజల్‌ వచ్చామ‌ని, అనంత‌రం 1994లో అక్కడి భూములు కొన్నామ‌ని వివ‌రించారు. త‌మ‌ గోదాములు ఖాళీ చేయించి ఆర్థికంగా త‌మ‌ను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు.  


Go Back to Shorts
Etela Rajender
TRS

More Telugu News