అకీరా ఎంట్రీపై స్పందించిన రేణు దేశాయ్!
- మరాఠీ సినిమాలతో బిజీగా రేణు దేశాయ్
- కథాకథనాలపై మంచి అవగాహన
- సోషల్ మీడియాలో యాక్టివ్
- అకీరా ఎంట్రీ గురించి అడిగిన అభిమానులు
- ఇది సమయం కాదన్న రేణు దేశాయ్
మెగా ఫ్యామిలీకి సంబంధించిన కుర్రాళ్లంతా ఒక్కొక్కరిగా తెరకి పరిచయమవుతున్నారు. అకీరా ఎంట్రీ కోసం పవన్ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందువలన వాళ్లు టాలీవుడ్ తెరపైకి జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీ ఎప్పుడనే విషయాన్ని అడిగారు.
"ఒక వైపున కరోనా విజృంభిస్తోంది .. దాని బారినపడి ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఎవరి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో వాళ్లు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హీరోగా అకీరా ఎంట్రీ గురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన సమయం కాదు" అని ఆమె సమాధానం ఇచ్చారు.