రఘురామ బెయిల్ తీర్పు కాపీని ఆర్మీ ఆసుపత్రికి అందజేసిన న్యాయవాదులు
- రఘురామపై ఏపీ సీఐడీ రాజద్రోహం కేసు నమోదు
- బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
- తీర్పు కాపీ విడుదల
- రఘురామ సోమవారం విడుదలయ్యే అవకాశం
బెయిల్ తీర్పు కాపీలో సుప్రీం పలు అంశాలను పేర్కొంది. తన బెయిల్ కోసం రఘురామ 10 రోజుల్లో సీఐడీ కోర్టులో రూ.1 లక్ష పూచీకత్తు చెల్లించి బెయిల్ పొందవచ్చని వివరించింది. అందుకోసం ఇద్దరు హామీదార్ల పేర్లను కూడా చేర్చాల్సి ఉంటుంది. ఈ పత్రాలను సోమవారం ఆయన న్యాయవాదులు సీఐడీ కోర్టులో సమర్పించిన మీదట, సైనికాసుపత్రి నుంచి రఘురామ విడుదల కానున్నారు.