Trivikram Srinivas: చరణ్ కోసం కథ రెడీ చేసిన త్రివిక్రమ్!

Trivikram another movie with Ramcharan
షార్ట్స్‌లో చూడండి
త్రివిక్రమ్ ఎప్పుడూ కూడా చాలా కూల్ గా ఒక సినిమా తరువాత ఒక సినిమా చేసుకుంటూ వెళుతుంటారు. కథ .. స్క్రీన్ ప్లే ... మాటలు .. ఇవన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి గనుక, ఎక్కువగా టెన్షన్ పడరు. ఇక హీరోలందరితోను ఆయనకి ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఆయనపై వాళ్లకి పూర్తిస్థాయిలో నమ్మకం ఉంది. అందువలన అటు వైపు నుంచి కూడా ఆయనను తొందర చేసేవారు లేరు. ఇంత కూల్ గా కథపై కూర్చుంటాడు గనుకనే ఆయన అద్భుతాలు చేస్తుంటారు.

ప్రస్తుతం ఆయన మహేశ్ బాబు కథానాయకుడిగా ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా తరువాత ఏ హీరోతో త్రివిక్రమ్ ప్రాజెక్టు ఉండనుంది? అనే ప్రశ్నకి సమాధానంగా చరణ్ పేరు వినిపిస్తోంది. మెగా హీరోల్లో పవన్ తోను .. బన్నీతోను మూడేసి సినిమాలు తెరకెక్కించిన త్రివిక్రమ్, చరణ్ తో మాత్రం ఇంతవరకూ సినిమా చేయలేదు. ఆయనతో తప్పకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఒక కథను రెడీ చేసి ఉంచాడట. మహేశ్ తో సినిమా తరువాత త్రివిక్రమ్ పట్టాలెక్కించే ప్రాజెక్టు ఇదేనని అంటున్నారు.
Go Back to Shorts
Trivikram Srinivas
Charan
Mahesh Babu

More Telugu News