Vijay: యాక్షన్ సీన్స్ లో విజయ్ విజృంభిస్తాడట!

More action scenes in Vijay 65th movie
షార్ట్స్‌లో చూడండి
తమిళనాట విజయ్ కి మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. విజయ్ స్టైల్ ను అక్కడి మాస్ ఆడియన్స్ ఎంతగానో ఇష్టపడతారు. అందువల్లనే విజయ్ తన సినిమా కథల్లో వాళ్లకి నచ్చే అంశాలు పుష్కలంగా ఉండేలా చూసుకుంటాడు. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమా విషయంలోను ఆయన ఇవే జాగ్రత్తలు తీసుకున్నాడని చెబుతున్నారు.

ఈ సినిమాలో కారు ఛేజింగులు .. బైక్ ఛేజింగులు .. గుర్రపు స్వారీలు .. గన్ ఫైట్లు ఉంటాయట. ఈ యాక్షన్ సీన్స్ లో విజయ్ ఒక రేంజ్ లో విజృంభిస్తాడని అంటున్నారు. ఇంతటి భారీ యాక్షన్స్ సీన్స్ విజయ్ స్టైల్లోనే సాగుతాయి. ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా విజయ్ అభిమానులు వీలైనన్ని విజిల్స్ కొట్టేలా ఉంటాయని చెబుతున్నారు.

విజయ్ ఫ్యాన్స్ వన్స్ మోర్ అనిపించేలా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ యాక్షన్ సీన్స్ ను డిజైన్ చేయించినట్టుగా చెబుతున్నారు. విజయ్ కి ఇది 65వ సినిమా .. త్వరలోనే దీనికి పవర్ఫుల్ టైటిల్ ను ఎనౌన్స్ చేయనున్నారు. సన్ పిక్చర్స్  బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన నాయికగా పూజ హెగ్డే ఆడిపాడనుంది. ఈ సినిమా కోసం ఆమె అత్యధిక పారితోషికాన్ని అందుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు.
Go Back to Shorts
Vijay
Pooja Hegde
Kollywood

More Telugu News