బెంగాల్ ఎన్నికల్లో పెను సంచలనం... నందిగ్రామ్ లో సీఎం మమతా బెనర్జీ ఓటమి
- వెలువడిన నందిగ్రామ్ ఫలితం
- బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి విజయం
- 1,736 ఓట్ల మెజారిటీతో గెలుపు
- బెంగాల్ లో టీఎంసీ హవా
- అధికారంలోకి రావాలనుకున్న బీజేపీకి ఎదురుదెబ్బ
పశ్చిమ బెంగాల్ లో 292 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, నేడు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటివరకు అధికార టీఎంసీ 192 స్థానాల్లో నెగ్గింది. మరో 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 147 కాగా, ఆ మార్కును టీఎంసీ ఎప్పుడో దాటేసింది. ఇక, ఈ ఎన్నికల ద్వారా బెంగాల్ అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని కలలు గన్న బీజేపీకి ఆశాభంగం తప్పలేదు. బీజేపీ 61 స్థానాల్లో నెగ్గి, మరో 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.