మారుతీ సుజుకి మాజీ ఎండీ ఖట్టర్ కన్నుమూత
- ఈ ఉదయం గుండెపోటుతో మృతి
- ఖత్తర్ వయసు 79 సంవత్సరాలు
- 1993లో మారుతి సంస్థలో డైరెక్టర్ గా ప్రవేశం
- అంచెలంచెలుగా ఎదిగిన వైనం
ఖట్టర్ ఐఏఎస్ అధికారి. మారుతి సుజుకి సంస్థలో ప్రభుత్వ పెట్టుబడులు ఉండడంతో ఆయనకు ఆ సంస్థలో ఉన్నత పదవి లభించింది. అయితే 2002లో కేంద్ర ప్రభుత్వం సుజుకి కార్పొరేషన్ తో ఒప్పందాన్ని తెగదెంచుకుంది. దాంతో మారుతి సంస్థను తన సత్తాతో కొద్దికాలంలోనే లాభాల బాట పట్టించారు. ఖట్టర్ 2007లో ఎండీగా పదవీ విరమణ చేశారు. మారుతి నుంచి రిటైరైన తర్వాత ఓ చెయిన్ సంస్థను ఏర్పాటు చేసి సీబీఐ కేసును ఎదుర్కోవాల్సి వచ్చింది. కాగా, ఖట్టర్ మృతితో భారత ఆటోమొబైల్ రంగంలో విషాదం నెలకొంది.