ముంబయితో మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్
- ఐపీఎల్ నేడు ముంబయి వర్సెప్ పంజాబ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
- చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్
- విజయం కోసం తహతహలాడుతున్న పంజాబ్
- ఇప్పటిదాకా 4 మ్యాచ్ లు ఆడి ఒక విజయం
ఈ క్రమంలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి ముంబయిని తక్కువ స్కోరుకే కట్టడి చేసి, ఆపై లక్ష్యఛేదనలో సఫలం కావాలని కోరుకుంటోంది. అటు ముంబయి జట్టు ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడి రెండింట గెలిచింది.
ఈ మ్యాచ్ కోసం ముంబయి జట్టులో ఎలాంటి మార్పులు లేకపోగా... పంజాబ్ కింగ్స్ లెగ్ స్పిన్నర్ మురుగన్ అశ్విన్ స్థానంలో మరో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ని జట్టులోకి తీసుకుంది.