భవనం పైనుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని బెదిరిస్తోన్న టీఆర్ఎస్ మ‌హిళా నేత‌.. వీడియో ఇదిగో

22-04-2021 Thu 11:46
  • వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీకి బీఫామ్ ఇవ్వ‌లేద‌ని ఆవేద‌న‌
  • డ‌బ్బులు ఇచ్చిన వారికే టీఆర్ఎస్ బీఫామ్‌ ఇస్తోంద‌ని ఆరోప‌ణ‌
  • హన్మకొండలోని అదాలత్ కూడలిలో క‌ల‌క‌లం
ruckus in hanmakonda
వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో డ‌బ్బులు ఇచ్చిన వారికే టీఆర్ఎస్ పార్టీ బీఫామ్‌ ఇస్తోంద‌ని, క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తోన్న త‌న‌కు ఇవ్వ‌లేద‌ని ఆరోపిస్తూ తుమ్మల శోభారాణి అనే మ‌హిళ‌ నాలుగు అంత‌స్తుల భ‌వనంపైకి పెట్రోల్ బాటిల్ ప‌ట్టుకుని ఎక్కి ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని బెదిరిస్తోంది.  

హన్మకొండలోని అదాలత్ కూడలిలో నిర్మాణంలో ఉన్న ఆ భవనంపైకి ఆమె ఎక్కింద‌న్న విష‌యాన్ని తెలుసుకున్న పోలీసులు, స‌హాయ‌క సిబ్బంది వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని కింద‌కు దిగాల‌ని ఆమెకు సూచిస్తున్నారు. అయితే, తాను కింద‌కు దిగ‌బోన‌ని 58వ డివిజన్‌లో తాను నామినేషన్‌ దాఖలు చేయ‌గా, బీఫామ్‌ కోసం రూ.50 లక్షలు డిమాండ్ చేశారని ఆమె ఆరోపిస్తోంది. దీంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.