Dil Raju: ‘వకీల్‌సాబ్’ బృందాన్ని పీడిస్తున్న కరోనా.. దిల్‌రాజుకు పాజిటివ్

Tollywood Producer Dil Raju infected to corona virus
షార్ట్స్‌లో చూడండి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా బృందంలోని ఒక్కొక్కరు కరోనా బారినపడుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నివేదా థామస్ ఇప్పటికే కరోనా బారినపడి కోలుకుంటుండగా, పవన్ కల్యాణ్ క్వారంటైన్‌లో గడుపుతున్నారు. తాజాగా, ఈ సినిమా నిర్మాత దిల్‌రాజు‌కు కూడా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లారు.

ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకకు కూడా ఆయన హాజరు కాలేకపోయారు. కాగా, దర్శకుడు వీఎన్ ఆదిత్యతోపాటు మరో ఇద్దరు నిర్మాతలు కూడా కరోనా బారిపడ్డారు.
Go Back to Shorts
Dil Raju
Corona Virus
Vakeel Saab
Pawan Kalyan

More Telugu News