'వకీల్ సాబ్' దెబ్బకి అందరిచూపూ ఆ రీమేక్ వైపే!
- పింక్ రీమేక్ గా వచ్చిన 'వకీల్ సాబ్'
- సెట్స్ పై మరో మలయాళ రీమేక్
- ఈ ఏడాదిలోనే విడుదల
- అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి
'వకీల్ సాబ్' హిందీలో భారీ విజయాన్ని సాధించిన 'పింక్' సినిమాకి రీమేక్. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో, పవన్ తదుపరి సినిమా అయిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ పై అందరి దృష్టి నిలిచింది. ఇది మలయాళంలో సంచలన విజయాన్ని సాధించిన సినిమా. తెలుగులో సాగర్ కె చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్పులు చేర్పులు చేసుకుని ఆయన రంగంలోకి దిగాడు. రెండు బలమైన పాత్రల మధ్య జరిగే ఘర్షణ ఈ సినిమా. మరో ప్రధానమైన పాత్రను రానా చేస్తున్నాడు. ఆయన క్రేజ్ కూడా ఈ ప్రాజక్టుకు యాడ్ కానుంది. ఈ ఏడాదిలోనే విడుదల కానున్న ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి ఉంది.