Balka Suman: కొడంగల్ లో తంతే మల్కాజిగిరిలో పడ్డావు... అక్కడ తంతే ఎక్కడ పడతావో చూస్కో: రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ వ్యాఖ్యలు

Balka Suman fires on Revanth Reddy
షార్ట్స్‌లో చూడండి
టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో పెద్దవూరలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి కొడంగల్ లో తంతే మల్కాజిగిరిలో పడ్డాడని, ఇప్పుడు అక్కడ తంతే ఇంకెక్కడ పడతాడో చూసుకోవాలని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ కు పదవులు ఓ లెక్క కాదని, ఉద్యమం చేసి తెలంగాణ సాధించారని వెల్లడించారు. కేసీఆర్ ఉద్యమం చేస్తున్నప్పుడు నువ్వెక్కడున్నావ్? అంటూ రేవంత్ పై మండిపడ్డారు. కొడంగల్ లో ఘోర పరాజయం పాలైనప్పటికీ రేవంత్ కు సిగ్గు రాలేదని, ఆంధ్రా పాలకుల తొత్తుగా పనిచేసిన రేవంత్ కు టీఆర్ఎస్, కేసీఆర్ పేరెత్తే హక్కులేదన్నారు.

పెద్దల గురించి అవాకులు చెవాకులు పేలుతూ  ప్రస్తుతం రేవంత్ రెడ్డి శునకానందం అనుభవిస్తున్నాడని, మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని, చిప్పకూడు తినడం తథ్యమని బాల్క సుమన్ పేర్కొన్నారు. గతంలో పెయింటర్ గా పనిచేసిన రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయలు ఎలా సంపాదించాడో చెప్పాలని ప్రశ్నించారు. మైకు దొరికితే చాలు కుక్కలాగా మొరుగుతుంటాడని విమర్శించారు. 'నేనొక్క పిలుపు నిస్తే కార్యకర్తలు, అభిమానులు నీ సంగతేంటో చూస్తారు' అని సుమన్ హెచ్చరించారు.
Go Back to Shorts
Balka Suman
Revanth Reddy
Nagarjuna Sagar Bypolls
KCR
TRS
Congress
Telangana

More Telugu News