Allu Arjun: 'పుష్ప' నుంచి వదిలింది టీజర్ కాదు .. రాకెట్!

  • అందరి దృష్టి 'పుష్ప' పైనే
  • పాత రికార్డులను చెరిపేస్తున్న టీజర్
  • ప్రతినాయకుడి పాత్రలో ఫహాద్ ఫాజిల్        
Pushpa Movie Teaser Record

ఇప్పుడు అందరి దృష్టి 'పుష్ప' పైనే ఉంది. ఈ సినిమా షూటింగు మొదలైన దగ్గర నుంచి అంచనాలు పెంచుతూనే వెళుతోంది. సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన సినిమాలు సూపర్ హిట్లు కావడంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు. కేవలం బన్నీ పాత్రకి సంబంధించిన యాక్షన్ సీన్స్ పై ఈ టీజర్ ను కట్ చేశారు. ఈ టీజర్ లో పుష్పరాజ్ పాత్రలో 'తగ్గేదే లే .. ' అంటూ బన్నీ చేసిన సందడి అంతా ఇంతా కాదు.

యూ ట్యూబ్ లో ఈ టీజర్ ను ఇలా వదలగానే అలా రాకెట్ లా దూసుకుపోయింది. 24 గంటల్లోనే 25 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది. ప్రస్తుతం 30 మిలియన్లకు పైగా వ్యూస్ ను .. 9 లక్షలకు పైగా లైక్స్ తో దూసుకుపోతోంది. ఒక టీజర్ ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి వ్యూస్ ను .. ఈ స్థాయి లైక్స్ ను సాధించడం విశేషంగా చెబుతున్నారు. టాలీవుడ్లో ఇంతవరకూ ఎవరూ సాధించని రికార్డును బన్నీ సొంతం చేసుకున్నాడని అంటున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడి పాత్రలో ఫహాద్ ఫాజిల్ కనిపించనున్నాడు.

More Telugu News