తెలంగాణలో లాక్‌డౌన్ అంటూ నకిలీ ఉత్తర్వులు ప్రచారం చేసిన యువకుడి అరెస్టు
- ఇటీవల సామాజిక మాధ్యమాల్లో నకిలీ జీవో వైరల్
- నిందితుడు శ్రీపతి సంజీవ్ నకిలీ జీవోను సృష్టించాడన్న పోలీసులు
- ఓ ల్యాప్‌టాప్, మొబైల్ స్వాధీనం
- పాత జీవోలో మార్పులు చేసి కొత్తదిగా రూపొందించాడని వెల్లడి
నిందితుడి నుంచి ఓ ల్యాప్‌టాప్, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అతడి స్వస్థలం నెల్లూరు అని, ఓ ప్రైవేటు సంస్థలో ఛార్టెడ్ అకౌంటెంట్‌గా ఇక్కడ పని చేస్తున్నాడని తెలిపారు. తెలంగాణలో గత ఏడాది లాక్‌డౌన్‌పై ప్రభుత్వం ఇచ్చిన జీవోను డౌన్‌లోడ్ చేసుకున్న శ్రీపతి అందులో మార్పులు చేసి కొత్త జీవోగా దాన్ని సృష్టించారని అంజనీ కుమార్ చెప్పారు.
అనంతరం ఆ నకిలీ జీవోను సంజీవ్ తో పాటు అతడి స్నేహితులు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారని తెలిపారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలను ఎవ్వరూ షేర్ చేయొద్దని, నిజాన్ని నిర్ధారించుకోకుండా షేర్ చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పారు.