Andhra Pradesh: ఏపీలో మళ్లీ కరోనా విజృంభణ... 24 గంటల్లో 200కి పైగా కొత్త కేసులు

AP Corona Update
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ తీవ్రతరం అవుతోంది. గడచిన 24 గంటల్లో ఏపీలో 45,664 కరోనా పరీక్షలు నిర్వహించగా 298 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 90 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 48 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లాలో 32, కృష్ణా జిల్లాలో 32, విశాఖ జిల్లాలో 32 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 164 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 8,91,861 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,83,277 మంది కరోనా ప్రభావం నుంచి విముక్తులయ్యారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 1000కి పైనే నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,400 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మరణాల సంఖ్య 7,184కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Positive Cases
Active Cases
Deaths
Update

More Telugu News