Stalin: వంట గ్యాస్, పెట్రోల్ ధరలతో పాటు వివిధ హామీలతో స్టాలిన్ మేనిఫెస్టో

DMK Manifesto released
షార్ట్స్‌లో చూడండి
తమిళనాట ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతోంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీలు ఊరించే హామీలను ఇస్తున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్ ఈరోజు డీఎంకే మేనిఫెస్టోను విడుదల చేశారు. ఓటర్లను ఆకట్టుకునే అన్ని అంశాలను మేనిఫెస్టోలో డీఎంకే పొందుపరిచింది. ఇందులో ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధర తగ్గింపు, వంటగ్యాస్ సిలిండర్ పై రాయితీ వంటి హామీలు ఉన్నాయి.

డీఎంకే మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు ఇవే:
లీటర్ పెట్రోల్ పై రూ. 5, లీటర్ డీజిల్ పై రూ. 4 తగ్గింపు
వంటగ్యాస్ సిలిండర్ పై రూ. 100 రాయితీ
మహిళల ప్రసూతి సెలవులు 12 నెలలకు పెంపు
ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాపులు
పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు
ఆస్తి పన్ను పెంపు రద్దు
జర్నలిస్టుల కోసం ప్రత్యేక కమిషన్
ఆవిన్ పాల ధర లీటర్ పై రూ. 3 తగ్గింపు
రాష్ట్ర వ్యాప్తంగా కలైంగర్ క్యాంటీన్లు
ప్రభుత్వ ఉద్యోగులుగా మధ్యాహ్న భోజన సిబ్బంది
అన్నాడీఎంకే అవినీతి మంత్రులపై విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు.
Go Back to Shorts
Stalin
DMK
Manifesto

More Telugu News