తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు
- ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు
- గత అర్ధరాత్రి నుంచే ఆలయాల్లో ప్రారంభమైన వేడుకలు
- భక్తుల కోసం ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
తెలంగాణలోని వేములవాడలో కొలువైన రాజరాజేశ్వరస్వామి, కీసర రామలింగేశ్వరస్వామి, కాళేశ్వరం, రామప్ప ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇరు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో గత అర్ధరాత్రి నుంచే శివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా ఆలయాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.