మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌వ‌న్ 'వ‌కీల్ సాబ్' నుంచి ప్ర‌త్యేక‌ పోస్టర్ విడుద‌ల‌
Add ap7am to your home Screen

మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌వ‌న్ 'వ‌కీల్ సాబ్' నుంచి ప్ర‌త్యేక‌ పోస్టర్ విడుద‌ల‌

Heres wishing all the women out there a HappyWomensDay from team
  • పోస్ట‌ర్‌లో నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల
  • ఓ చేతిలో బేస్ బాల్ బ్యాట్ తో ప‌వ‌న్
  • మ‌రో చేతిలో న్యాయ‌శాస్త్ర పుస్త‌కం
ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తోన్న 'వ‌కీల్ సాబ్' సినిమా నుంచి అంతర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఓ  పోస్ట‌ర్ విడుద‌లైంది. నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల కీలక పాత్రల్లో ఉన్న ఈ పోస్టర్ అల‌రిస్తోంది. వారు ముగ్గురు త‌న‌ వెన‌క నిల‌బ‌డ‌గా మ‌హిళ‌ల‌ను కాపాడే అడ్వకేట్ ‌లా ప‌వ‌న్ క‌ల్యాణ్ కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఓ చేతిలో బేస్ బాల్ బ్యాట్, మ‌రో చేతిలో న్యాయ‌శాస్త్ర పుస్త‌కం ప‌ట్టుకుని సీరియ‌స్ లుక్‌లో క‌నప‌డుతున్నారు.

గ‌త ఏడాది మార్చి 8న కూడా మ‌హిళా దినోత్స‌వం సందర్భంగా ఈ సినిమా నుంచి 'మ‌గువా.. మ‌గువా' అనే పాట విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Womens Day
Vakeel Saab
Pawan Kalyan
Viral Pics

More Telugu News