వృద్ధి బాటన భారత్ పరుగులు: బ్లూమ్ బర్గ్!
- తిరోగమనం పోయి వృద్ధి పథం
- సర్వీసెస్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో వృద్ధి
- 13 శాతానికి పైగా జీడీపీ వృద్ధి అంచనా
రానున్న నూతన ఆర్థిక సంవత్సరంలో ఇండియా వృద్ధి రేటులోకి తిరిగి రానుందని అభిప్రాయపడిన బ్లూమ్ బర్గ్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా భారత్ నిలుస్తుందని అంచనా వేసింది. ఇదిలావుండగా, 2021-22 ఫైనాన్షియల్ సంవత్సరంలో ఇండియా 13.7 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేయవచ్చని ఇప్పటికే మరో రీసెర్చ్ సేవల సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ అంచనా వేసిన సంగతి తెలిసిందే.