ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. 180 మీటర్ల దూరంలో బాధితులు
- సొరంగంలో ఇంకా 30 మంది ఉంటారని అనుమానం
- గట్టిపడిన బురదగుండా డ్రిల్లింగ్ చేపట్టిన సహాయక సిబ్బంది
- ఇప్పటి వరకు 32 మంది మృతదేహాల వెలికితీత
సొరంగంలో ఇప్పటికే 120 మీటర్ల మేర బురదను తొలగించారు. మరో 180 మీటర్లు కనుక ఆ పని చేయగలిగితే లోపల చిక్కుకున్న బాధితులను రక్షించే వీలుంది. అయితే, బురద గట్టిగా మారడంతో తొలగించడం కష్టంగా మారుతోంది. దీంతో డ్రిల్లింగ్ పనులు చేపట్టారు.
మరోవైపు, నాలుగు రోజులుగా ప్రశాంతంగా ఉన్న ధౌలిగంగా నది నిన్న మళ్లీ ఒక్కసారిగా పోటెత్తడంతో సహాయక చర్యలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. కాగా, సొరంగంలో 30 మంది వరకు చిక్కుకుని పోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అలాగే, ఇప్పటి వరకు 32 మంది మృతదేహాలను వెలికి తీశారు.