అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నా.. అందుకే బీజేపీలో చేరా: కేరళ మాజీ డీజీపీ

Former DGP Jacob Thomas joins BJP
  • రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళ చేరుకున్న నడ్డా
  • కొచ్చి నుంచి ఓపెన్ టాప్ జీపులో త్రిసూర్‌కు..
  • రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన జాకబ్
కేరళ మాజీ డీజీపీ జాకబ్ థామస్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. త్రిసూర్‌లోని టెక్కిన్‌కడ్ మైదానంలో నిన్న జరిగిన బహిరంగ సభలో ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో జాకబ్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జాకబ్ మాట్లాడుతూ అధికార పార్టీపై దుమ్మెత్తి పోశారు. లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీలు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా తాను పోరాడుతున్నానని, అందుకనే బీజేపీలో చేరినట్టు చెప్పారు.

కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో పార్టీని సమాయత్తం చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న కొచ్చి చేరుకున్నారు. ఈ సందర్భంగా వందలాదిమంది బీజేపీ కార్యకర్తలతో విమానాశ్రయం నుంచి ఓపెన్ టాప్ జీపులో నడ్డా త్రిసూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాజీ డీజీపీ జాకబ్ బీజేపీలో చేరారు.
Go Back to Shorts
Kerala
Assembly polls
JP Nadda
Jacob Thomas

More Telugu News