Banda Prakash: పీవీకి భారతరత్న... రాజ్యసభలో ఎలుగెత్తిన టీఆర్ఎస్ సభ్యుడు

TRS MP Banda Prakash demands Bharata Ratna for PV Narasimharao
షార్ట్స్‌లో చూడండి
దివంగత మాజీ ప్రధాని, బహుముఖ ప్రజ్ఞావంతుడు పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. తాజాగా పార్లమెంటు సమావేశాల సందర్భంగా టీఆర్ఎస్ సభ్యుడు బండా ప్రకాశ్ రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అంతేకాదు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని, ఓ రహదారికి కూడా ఆయన పేరిట నామకరణం చేయాలని కోరారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే చర్చ సమయంలో బండా ప్రకాశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో వ్యాక్సిన్ పరీక్ష, ధ్రువీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
Banda Prakash
PV Narasimharao
Bharata Ratna
Rajya Sabha
TRS

More Telugu News