రేపు రాత్రి 11.52గంటలకు 'డ్రాగన్' గ్లింప్స్.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్
- ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో 'డ్రాగన్' నుంచి ఫస్ట్ గ్లింప్స్ రాక
- తారక్ పుట్టినరోజు కానుకగా రేపు రాత్రి 11:52 గంటలకు విడుదల
- ఏకంగా 4 నిమిషాల 35 సెకన్ల నిడివితో ఉండనున్న వీడియో
- గ్లింప్స్‌కు సెన్సార్ బోర్డు నుంచి U/A 16+ సర్టిఫికెట్ జారీ
- డిజిటల్‌తో పాటు ఎంపిక చేసిన థియేటర్లలోనూ గ్లింప్స్ ప్రదర్శన
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం 'డ్రాగన్' నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఏకంగా 4 నిమిషాల 35 సెకన్ల సుదీర్ఘ నిడివితో ఈ గ్లింప్స్ ఉండబోతుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
'డ్రాగన్' రాత్రి 11:52 గంటలకు ఈ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో కూడా ఈ వీడియోను ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ భారీ గ్లింప్స్‌కు సెన్సార్ బోర్డు నుంచి U/A 16+ రేటింగ్‌తో ధ్రువీకరణ పత్రం కూడా లభించింది. "విధ్వంసం మరో రేంజ్‌లో ఉంటుంది" అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ అంచనాలను మరింత పెంచేసింది.
'ఆర్ఆర్ఆర్', 'దేవర' వంటి భారీ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడం, 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడంతో 'డ్రాగన్'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఫస్ట్ లుక్ కూడా విడుదల కాకపోవడంతో నిరాశలో ఉన్న అభిమానుల ఆకలి తీర్చేలా ఈ భారీ గ్లింప్స్ ఉండబోతోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.