నమ్మశక్యం కాని రీతిలో పెరిగిన నటుడు విజయ్ సేతుపతి పారితోషికం!
Add ap7am to your home Screen

నమ్మశక్యం కాని రీతిలో పెరిగిన నటుడు విజయ్ సేతుపతి పారితోషికం!

Actor Vijay Sethupathi Remunaration Peaks
  • వరుసగా హిట్స్ ఇస్తున్న విజయ్ సేతుపతి
  • 'మాస్టర్' తరువాత పెరిగిన ఇమేజ్
  • షాహిద్ కపూర్ కన్నా అధిక పారితోషికం
ఇటీవలి కాలంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి పేరు ఎంతగా మారుమోగుతోందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 'తెన్ మెర్కు పరువ కాట్రు' హిట్ తరువాత, ప్రతియేటా హిట్ మీద హిట్ సాధిస్తూ విజయ్ సేతుపతి ముందుకు సాగుతున్నాడు. ఏ భాషలో మంచి అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో 'మక్కల్ సెల్వన్'గా అభిమానులు పిలుచుకునే విజయ్ సేతుపతి, తాజాగా 'మాస్టర్' చిత్రంలో దళపతి విజయ్ కి ప్రతి నాయకుడిగా నటించి మెప్పించడంతో అతని స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. తాజాగా, అతనికి ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు ఆఫర్ చేసిన మొత్తాన్ని చూస్తేనే సినీ వర్గాల మైండ్లు బ్లాంక్ అవుతున్నాయి.

పాన్ ఇండియా వెబ్ సిరీస్ గా రూపుదిద్దుకుంటున్న ఓ ప్రాజెక్టులో షాహిద్ కపూర్, రాశీ ఖన్నాలతో కలిసి విజయ్ సేతుపతి నటించేందుకు సైన్ చేశాడు. ఈ ప్రాజెక్టు కోసం అతనికి 55 కోట్ల రూపాయల పారితోషికం లభించనున్నదట. ఇక ఇదే ప్రాజెక్టులో భాగమైన షాహిద్ కపూర్ కు రూ. 40 కోట్లే దక్కనున్నాయని సినీ వర్గాల సమాచారం. ఈ మెగా వెబ్ సిరీస్ 'సున్నీ' పేరిట తయారవుతుండగా, రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ లోగా స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది.
Vijay Sethupathi
Remunaration
Shahid Kapoor
Web Series

More Telugu News